విశాఖ నేస్తమా !
మిన్ను
విఱిగి మీద పడ్డట్టు
పెనుతుపాను
విఱుచుక పడ్తే
చలించక
నిలిచిన నిన్ను చూచి
విస్తుపోయిన ఈ
విశ్వమంతా
నీ
స్థైర్యానికి జేజేలు పలుకు తోంది.
నీకెందుకింక భయం ?
నీ తోనే మేమున్నాం
నువ్వూ
నేను నేనూ నువ్వూ
నువ్వే
నేను నేనే నువ్వు
కలిసి మనం ఒకే జనం
మనం
మనం జనం మనం
పదంపదం కలిపి
నడుద్ద్దాం కలిసి శ్రమిద్దాం
మరచిపోలేని
ఆనాటి భయాలను ,బాధలను
మరుగున
తోసేసి, సంద్రం లోకి విసిరేద్దాం
ఒకరి
కొకరు బాసటయై, ధైర్యంగా నిలుద్దాం.
హుద్
హుద్ నే ఎదుర్కొన్న మీకు
మిగిలిన
భయాలన్నీ చిరుగాలులే సుమా!
ధైర్యంగా
ఉండు మిత్రమా!
దేశమంతా
నీ వైపే చూస్తోంది.
కష్టాల్లో ఉన్న ఆప్తున్ని అక్కున
చేర్చుకోవడానికి
ముందు
కొస్తోంది .
ఇంటి
ముందు ఈ దీపావళి కి దీపం మాత్రం వెలిగించు.
బాధలనే
చీకట్లను ఎద నుంచి తరిమి కొట్టు
వచ్చే
దీపావళి ని పచ్చని మన విశాఖ లో
బంధువుల
మథ్య పండుగలా జరుపుకుందాం.
మారుతుంది కాలం . మానుతుంది
గాయం
***